వేకువ ఎక్కడో లేదు
నీలోనే ఉంది..
ఉదయించడం..
అస్తమించడం..
తిరిగి.. నీకు నీవే ఉదయించడం
నీ చేతుల్లోనే ఉంది.
****
చీకటిని చీల్చుకుంటూ..
నీ చుట్టూ నీవు తిరిగే..
నీవోక పరిభ్రమరం
**
నీవే ఒక మేల్కొలుపు
నీవే ఒక వేకువ నెలవు
**
కావేవి..
అంతర్ధానం.. నిన్నటి ముచ్చట్లు
కావోయి.. నీకు నీవే సంబరం
**
ఆనక..
నీవు కాగలవు
నలుగురిని ప్రేమించగల అంబరం
**
ఎందుకోయి..
కుల, మత, ప్రాంతీయ, స్త్రీ , పురుష అక్కసులు
నీ బిడ్డలకు తండ్రి ఓ పురుషుడే
నిను కన్న తల్లీ ఓ స్త్రీనే.
పరాయి ప్రాంతమూ..
నిన్ను ఏదో ఒక రోజు మోసే ఉంటుంది
తన కౌగిలిలో నీ తల నిమిరే ఉంటుంది
****
నీలోని "నేను.. " అనే భావన..
ఒక మిధ్య.. అంతే, తెలుసుకో
నీ చుట్టూ ఉన్నది బెల్లం చుట్టూ ఈగలే
పొంగిపోకు..
అదొక..అపరిచిత ప్రయాణం
ఎప్పటికైనా... బయటకు రావాల్సిందే
***
నీ మనసొక భేదం ఎంచని చెలిమయితే
లోకమంతా.. నీ నేస్తాలే!!
-Gangadhae Veerla
